వివేకా హత్య కేసుపై వైసీపీ అధినేత జగన్ను నిలదీసిన శ్రీకాకుళం నేత అశోక్
రిపోర్టర్: హరి
స్థలం: శ్రీకాకుళం
వివేకా హత్య కేసులో అంతిమ లబ్ధిదారు ఎవరో తేలిపోయిందని, రూ.40 కోట్ల సుపారీ నిజం బట్టబయలైందని బెందాళం అశోక్ శ్రీకాకుళం పేర్కొన్నారు. మద్యం కుంభకోణంలో వేల కోట్లు దోచారంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రెండు కుంభకోణాల్లోనూ అంతిమ లబ్ధిదారుగా గొడ్డలి పార్టీ అధినేత వైపే అన్ని వేళ్లూ చూపిస్తున్నాయని తెలిపారు. ధైర్యముంటే వీటిపై ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ను ఆయన సూటిగా సవాల్ చేశారు.