కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెంచుతూ ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు
రిపోర్టర్: మహేష్
స్థలం: వరల్డ్
ఉత్తర కొరియా తూర్పు తీర ప్రాంతం నుంచి కొద్ది గంటల వ్యవధిలోనే రెండు క్షిపణి ప్రయోగాలు నిర్వహించి కొరియా ద్వీపకల్పంలో సైనిక ఉద్రిక్తతలను తీవ్రతరం చేసింది. వోన్స ప్రాంతం నుంచి స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలను వ్యతిరేకిస్తూ ఉత్తర కొరియా ఈ దాడులకు పాల్పడినట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో దక్షిణ కొరియా అత్యవసర జాతీయ భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించింది.