మాదారంలో గ్రామసభ.. 2026-27 అభివృద్ధి పనులపై చర్చ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: తాండూరు
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం మాదారం గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం వీబీజి రామ్ జీ గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ కుశనపల్లి లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన కుంట పనులు, ట్రెంచ్ పనులు, ఇంకుడు గుంతలు, పండ్ల తోటల పెంపకంపై చర్చించారు. ఈ పనులను తదుపరి గ్రామసభలో తీర్మానం చేస్తామని టీఏ ప్రసాద్ వెల్లడించారు.