మక్కా సమీపంలో హౌతీల డ్రోన్ కూల్చివేత

రిపోర్టర్: సురేష్ స్థలం: World

యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ పవిత్ర నగరం మక్కా లక్ష్యంగా ప్రయోగించిన డ్రోన్‌ను సౌదీ అరేబియా గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా కూల్చివేసింది. గగనతాగంలోకి ప్రవేశించకముందే దానిని ధ్వంసం చేసినట్లు సంకీర్ణ దళాలు వెల్లడించాయి. పవిత్ర ప్రదేశాల భద్రతను ఏ ధర చెల్లించయినా కాపాడుకుంటామని సైనిక ప్రతినిధి తుర్కి అల్-మల్కి హెచ్చరించారు. యెమెన్ ఘర్షణల నేపథ్యంలో ఈ దాడి తీవ్ర కలకలం రేపింది.