సింగారంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వేగంగా సాగుతున్న మార్కింగ్ ప్రక్రియ
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలంలోని సింగారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గుర్రాల నరేష్ యాదవ్ ఆధ్వర్యంలో లబ్ధిదారు కుకుట్ల భాగ్యలక్ష్మి ఇంటి స్థలంలో నూతన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మంగళవారం అధికారులు మార్కింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మౌనికతో పాటు సర్పంచ్ కొండ ప్రమీల పండరి, ఉప సర్పంచ్ కొవ్వూరి కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.