ఎన్నికల ప్రక్రియపై ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవం: మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: దిల్లీ
ఓటర్ల జాబితాల రూపకల్పన ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగుతోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. దిల్లీలోని ఏపీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏపై రాహుల్ గాంధీ, ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యవస్థలను అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ప్రజల్లో అపోహలు సృష్టించడం సరికాదని హితవు పలికారు. ఎన్నికల నిర్వహణపై కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.