తొంబై ఏళ్ల చరిత్ర కలిగిన పొలేరమ్మ జాతర వైభవంగా జరిగే వేళ

రిపోర్టర్: AHMED స్థలం: పొదలకూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో పోలేరమ్మ ఆలయం ఏర్పాటై తొంబై ఏళ్లు పూర్తయిన సందర్భంగా తొలిసారిగా పోలేరమ్మ జాతరను అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో ఎంతో వైభవంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు భక్తులు విశేషంగా తరలివచ్చే అవకాశం ఉండటంతో సిఐ వెంకట్రావు, ఎస్ఐ శివ రాకేష్ ఆలయాన్ని సందర్శించి భద్రత మరియు ట్రాఫిక్ నివారణ చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. జాతర ప్రశాంత వాతావరణంలో ముగిసేలా పోలీసుల ప్రాథమిక ప్రణాళికల ప్రకారం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.