ట్రంప్ అనారోగ్యంపై మళ్లీ చర్చ: వాషింగ్టన్‌లో వైరల్ ఫోటోలు

రిపోర్టర్: సురేష్ స్థలం: World

అమెరికాలో సెప్టెంబర్ 11 స్మారక కార్యక్రమంలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై మళ్లీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెంటగాన్‌లో జరిగిన ఈ వేడుకలో ట్రంప్ చాలా అలిసిపోయినట్లు కనిపించారు. ముఖ్యంగా ఆయన చీలమండల వద్ద వాపు స్పష్టంగా కనిపిస్తుండటంతో ఫోటోలు వైరల్ అయ్యాయి. గతంలో ఆయనకు సోకిన క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ సమస్యే దీనికి కారణమని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.