బ్యాంకు వినియోగదారులకు కీలక అలర్ట్: నవంబర్ రెండు నుండి ఎనిమిది వరకు సెలవులు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

నవంబర్ రెండు నుంచి ఎనిమిది వరకు ఉండనున్న బ్యాంక్ సెలవుల వివరాలను ఆర్బీఐ విడుదల చేసిందని అధికారులు తెలిపారు. ఈ వారం బ్యాంకులకు సంబంధించిన ముఖ్యమైన సెలవుల వివరాలను ప్రజలు ముందుగానే తెలుసుకోవాలని సూచించారు. బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డిజిటల్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. లావాదేవీలు నిలిచిపోకుండా ఆన్ లైన్ సేవలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు.