పాకిస్థాన్ లో హైబ్రిడ్ వ్యవస్థ అమలు: రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన ప్రకటన
రిపోర్టర్: సునీల్
స్థలం: ఇస్లామాబాద్
పాకిస్థాన్ లో సంప్రదాయ ప్రజాస్వామ్య పాలన లేదని, అక్కడ పౌర ప్రభుత్వం మరియు సైనిక నాయకత్వం కలిసి అధికారాన్ని పంచుకుంటున్నాయని ఆ దేశ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. బ్రిటిష్ జర్నలిస్ట్ మెహ్దీ హసన్ తో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ దేశంలో హైబ్రిడ్ వ్యవస్థ అమలవుతోందని తెలిపారు. సైన్యం, పౌర నాయకత్వం మధ్య అధికార పంపిణీ సమానంగా లేదని అంగీకరిస్తూ నిర్ణయాలు ఏకాభిప్రాయంతో జరుగుతాయని స్పష్టం చేశారు.