రాపిడో బైక్ రైడ్ లో మహిళకు వేధింపులు: బెంగళూరులో భయానక అనుభవం

రిపోర్టర్: రమేష్ స్థలం: బెంగళూరు

బెంగళూరులో రాపిడో బైక్ రైడ్ సమయంలో డ్రైవర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసినట్లు బాధితురాలు తెలిపారు. వైట్ఫీల్డ్ కు వెళ్లేందుకు ఆటో దొరకకపోవడంతో బైక్ బుక్ చేసుకున్నానని, ప్రయాణంలో డ్రైవర్ ముందుకు జరిగి కూర్చోవాలని పదేపదే కోరుతూ తీవ్ర అసౌకర్యానికి గురిచేశాడని ఆమె సోషల్ మీడియా వేదికగా వాపోయారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన రాపిడో సంస్థ వివరాలు కోరింది.