కష్టకాలంలో బాసటగా నిలిచిన "సత్యమేవ జయతే" బి,ఎస్,ఎఫ్,బ్యాచ్‌మేట్స్..!
రిపోర్టర్: Bobbili GANESH
స్థలం: భీమవరం
విజయనగరం జిల్లా...
బొబ్బిలి..
పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరానికి చెందిన బిఎస్ఎఫ్ జవాన్ స్వర్గీయ యమనమంద గంగారాజు అకస్మిక మరణంతో ఇబ్బందుల్లో ఉన్న ఆయన కుటుంబానికి "సత్యమేవ జయతే" బి,ఎస్,ఎఫ్, బ్యాచ్‌మేట్స్ అండగా నిలిచారు.
సహచరులంతా ఒకటై ఆర్థిక సాయంతో పాటు డిపార్ట్మెంట్ ప్రయోజనాలు అందేలా కొండంత భరోసానిచ్చారు. టేకన్పూర్ శిక్షణ నాటి స్నేహంతో "మేమందరం మీకు తోడుగా ఉన్నాం" అని ధైర్యం నింపి తమ ఐక్యతను, ఉదారతను చాటుకున్నారు. దొప్ప సత్యనారాయణ(గ్రూప్ అడ్మిన్)
"మన ఐక్యతే మన బలం. మన స్నేహమే మన ఊపిరి అన్న నినాదాన్ని ఆయన తెలియజేశారు.