కీసరగుట్ట ఆలయ పరిసరాల్ లో మద్యం సీసాలు: భక్తుల తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: కీసర
కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయ పరిసరాల్ లో మద్యం సీసాలు దర్శనమివ్వడం పట్ల భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని స్థానికులు తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగడం ఆలయ అధికారుల పర్యవేక్షణా లోపమేనని భక్తులు మండిపడుతున్నారు. ఆలయ పవిత్రతను కాపాడేందుకు అధికారులు తక్షణమే స్పందించి నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.