సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ.
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని 40 ఎకరాల భూ వివాదంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పిటిషన్ దాఖలులో 219 రోజుల జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన ధర్మాసనం, ప్రభుత్వం ఇచ్చిన కారణాలను కుంటి సాకులుగా కొట్టివేసింది. ఎస్ఎల్‌పీని ప్రాథమిక దశలోనే డిస్మిస్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.