సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల అభ్యర్థుల జాబితా పోర్టల్ ప్రారంభం
రిపోర్టర్: సతీష్
స్థలం: న్యూఢిల్లీ
కేంద్ర మాధ్యమిక విద్యా మండలి సీబీఎస్ఈ పదో తరగతి, ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల అభ్యర్థుల జాబితా సమర్పణ పోర్టల్‌ను ప్రారంభించింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా అక్టోబర్ 17వ తేదీ వరకు పాఠశాలలు విద్యార్థుల వివరాలను సమర్పించవచ్చని బోర్డు స్పష్టం చేసింది. ఆన్లైన్ విధానంలో పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులు మాత్రమే పరీక్షలకు హాజరయ్యేందుకు అర్హులని అధికారులు పేర్కొన్నారు.