భారత విద్యార్థులకు గుడ్ న్యూస్: బ్రిటన్ యూనివర్సిటీల నుంచి భారీ స్కాలర్షిప్లు

రిపోర్టర్: విజయ్ స్థలం: Hyderabad

బ్రిటన్లోని మాంచెస్టర్ నగరంలోని నాలుగు ప్రముఖ విశ్వవిద్యాలయాలు భారతీయ విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకమైన గ్రేట్ స్కాలర్షిప్స్ 2027 కార్యక్రమాన్ని ప్రకటించాయని బ్రిటిష్ కౌన్సిల్ అధికారులు తెలిపారు. ఈ స్కాలర్షిప్ కింద ఎంపికైన విద్యార్థులకు ట్యూషన్ ఫీజుల నిమిత్తం కనీసం పది వేల పౌండ్ల ఆర్థిక సహాయం అందజేస్తామని విశ్వవిద్యాలయాల వర్గాలు వెల్లడించాయి. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత సంస్థల వెబ్సైట్లలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.