ఖమ్మం ఐటీ హబ్లో ఏఐ, మెషీన్ లెర్నింగ్ శిక్షణ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం ఐటీ హబ్లో ఈ నెల 14 నుంచి ఏఐ, మెషీన్ లెర్నింగ్ అంశాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టాస్క్ (TASK) రీజినల్ మేనేజర్ అశోక్ కుమార్ నాయక్ వెల్లడించారు. సాంకేతిక రంగంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్యాలను అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.

ఈ శిక్షణలో పాల్గొనాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 11వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. కెరీర్లో మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.