తిరుమలలో నటి మహాలక్ష్మి దంపతుల వివాహ వార్షికోత్సవం: ట్రోలర్లకు గట్టి కౌంటర్
రిపోర్టర్: హరి
స్థలం: తిరుమల
తమిళ సీరియల్ నటి మహాలక్ష్మి, నిర్మాత రవీందర్ తమ నాలుగో వివాహ వార్షికోత్సవాన్ని శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రమైన తిరుమలలో ఘనంగా జరుపుకున్నట్లు నటి మహాలక్ష్మి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తమ జీవితం తిరుపతి పుణ్యక్షేత్రం నుంచే ప్రారంభమైందని, ఇతరుల విమర్శలతో ప్రేమకు సంబంధం లేదని పేర్కొన్నారు. తామిద్దరం ఎప్పుడూ ఒకరినొకరు ప్రేమిస్తూ ముందుకెళ్తామని చెబుతూ సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ కు ఆమె గట్టిగా కౌంటర్ ఇచ్చారు.