స్థానిక సంస్థల ఎన్నికలు: నామినేషన్ల డిపాజిట్లు మరియు వ్యయ పరిమితులు ఖరారు
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ధరావతు మరియు అభ్యర్థుల గరిష్ఠ ఎన్నికల వ్యయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం స్పష్టం చేసింది. రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఈ వివరాలను వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. మేయర్, ఛైర్మన్ స్థానాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ. 1,500 మరియు ఇతరులు రూ. 3 వేలు డిపాజిట్ చెల్లించాలని ఎన్నికల సంఘం పేర్కొంది.