ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన: గురువారం నుంచి బూత్ స్థాయిలో ప్రత్యేక డ్రైవ్
రిపోర్టర్: సతీష్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన ప్రక్రియలో భాగంగా గురువారం నుంచి బూత్ స్థాయిలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వెల్లడించారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో తొలగించబడిన ఓటర్ల స్థితిని బీఎల్ఓలు పునఃపరిశీలిస్తారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పిస్తామని, ఈనెల 16న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని ఆయన స్పష్టం చేశారు.