అంతరిక్షంలోనే ప్రాణ రక్షక ఔషధాల తయారీకి భారతీయ స్టార్టప్ శ్రీకారం

రిపోర్టర్: శివ స్థలం: India

భువనేశ్వర్‌కు చెందిన 'సెరెండిపిటీ స్పేస్' సంస్థ అంతరిక్షంలో ఔషధాల తయారీకి సిద్ధమైంది. మైక్రోగ్రావిటీని ఉపయోగించి క్యాన్సర్ వంటి వ్యాధులకు మెరుగైన మందులను తయారు చేయవచ్చని సీఈఓ అంతరిక్ష పరిచ్చా భావిస్తున్నారు. భూమిపై సాధ్యం కాని రీతిలో స్పటిక నిర్మాణాన్ని మార్చి, అత్యంత ప్రభావవంతమైన ఔషధాలను రూపొందించడమే లక్ష్యంగా ఈ స్టార్టప్ పనిచేస్తోంది. ఇది భవిష్యత్తు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుంది.