రూపాయి కంటే ఎక్కువ లావాదేవీలపై ఛార్జీలంటూ మధ్యప్రదేశ్లో నో యూపీఐ డే

రిపోర్టర్: రాము స్థలం: ఇండోర్

మధ్యప్రదేశ్లోని ఇండోర్లో వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నో యూపీఐ డే నిర్వహించారు. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఛార్జీలు అమలు చేయనున్న కొత్త విధానాన్ని వ్యతిరేకిస్తూ వ్యాపారులు తమ దుకాణాల వద్ద క్యూఆర్ కోడ్లను నల్లటి వస్త్రాలతో కప్పారు. ఈ నిరసనకు సుమారు 125 వ్యాపార సంఘాలు మద్దతు తెలిపినట్లు ప్రతినిధులు వెల్లడించారు. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానాన్ని పునఃపరిశీలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.