'ఉద్యోగ నోటిఫికేషన్ కోసం యువత ఉద్యమిస్తే కేసులా?': చంద్రబాబు సర్కార్‌పై గోరంట్ల మాధవ్ ఫైర్

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

ఎన్నికల సమయంలో ఇరవై లక్షల ఉద్యోగాలు, మూడు వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు యువతను మోసం చేశారని వైయస్ఆర్సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో ఇరవై వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నామని చెప్పి కేవలం రెండు వేలు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ఉద్యమిస్తున్న యువతపై ప్రభుత్వం కేసులు బనాయించడం అన్యాయమని, కూటమి సర్కార్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన హెచ్చరించారు.