ఆరోగ్య హెచ్చరిక: మెట్లు ఎక్కుతుంటే ఆయాసం వస్తుందా అయితే తస్మాత్ జాగ్రత్త
రిపోర్టర్: గోపి
స్థలం: ఢిల్లీ
మెట్లు ఎక్కుతున్నప్పుడు అధిక ఆయాసం రావడం కేవలం శారీరక ఫిట్నెస్ లేకపోవడం వల్లనే కాదని, అది తీవ్రమైన అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని ఢిల్లీలోని సీకే బిర్లా హాస్పిటల్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ వికాస్ మిట్టల్ స్పష్టం చేశారు. ఆయాసం కొత్తగా ప్రారంభమైనా, క్రమంగా పెరుగుతున్నా లేదా సాధారణ శ్రమకే తీవ్రంగా వస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని ఆయన హెచ్చరించారు.