మహాదేవ్ యాప్ కుంభకోణం: ఓమన్ నుండి ప్రధాన నిందితుడు సౌరభ్ చంద్రకర్ అరెస్ట్
రిపోర్టర్: అశోక్
స్థలం: New Delhi
మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన సౌరభ్ చంద్రకర్‌ను ఓమన్ నుండి భారత్ కు రప్పించినట్లు సీబీఐ, ఈడీ అధికారులు వెల్లడించారు. రూ.6,000 కోట్ల విలువైన ఈ అక్రమ నెట్వర్క్ కు సంబంధించి దుబాయ్ లో ఉన్న సహ వ్యవస్థాపకుడు రవి ఉప్పల్ అప్పగింత కోసం కూడా దర్యాప్తు సంస్థలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ కు చెందిన ఈ నిందితులు విదేశాల నుండి ఈ సిండికేట్‌ను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.