రూ. 4 వేల కోట్లతో ఆదాని ఆరోగ్య మందిర్ గౌతమ్ ఆదాని ప్రకటన
రిపోర్టర్: సునీల్
స్థలం: కోల్‌కతా
పశ్చిమ బెంగాల్‌లోని న్యూటౌన్‌లో ప్రతిపాదిత ఆదాని ఆరోగ్య మందిర్ ప్రాజెక్టు కోసం రూ. 4 వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు ఆదాని గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ ఆదాని గురువారం ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక ఆరోగ్య ప్రాజెక్టు ద్వారా పది వేలకు పైగా ఉద్యోగాలు సృష్టించబడతాయని తెలిపారు. 2,000 పడకలతో నాన్ ప్రాఫిట్ ప్రాతిపదికన నిర్మించనున్న ఈ ఆసుపత్రిలో, వెయ్యి పడకలను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి కేటాయించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.