అన్న క్యాంటీన్లతో పేదల ఆకలి తీరుతోంది: ఉమ్మడి విజయనగరంలో నిత్యం భోజనం
రిపోర్టర్: రాము
స్థలం: విజయనగరం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పునఃప్రారంభించిన అన్న క్యాంటీన్లు పేదలు, దినసరి కార్మికులకు అక్షయపాత్రలా నిలుస్తున్నాయని జోనల్ మేనేజర్ వీఎస్కే శర్మ తెలిపారు. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా మొత్తం పదకొండు క్యాంటీన్ల ద్వారా నిత్యం ఇరవై వేల మందికి పైగా కేవలం ఐదు రూపాయలకే రుచి, శుచితో కూడిన అల్పాహారం, భోజనం అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి ది ఐదు రూపాయల చొప్పున ఖర్చు భరిస్తోందని పేర్కొన్నారు.