ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పుపై మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ సంచలన హెచ్చరిక
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుష్టశక్తుల చేతిలో చిక్కితే వంద కోట్ల మంది మరణాలకు దారితీసే పెను విపత్తు మునుముందు సంభవించవచ్చని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఓ అమెరికన్ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ హెచ్చరికలు చేశారు. ఆధునిక ఏఐ టూల్స్‌ను ఉపయోగించి చేసే సైబర్ దాడులు, జీవాయుధాల ప్రయోగం ఊహించని నష్టాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు. ఈ ప్రమాదాన్ని నివారించడానికి ప్రభుత్వాలు వెంటనే కఠినమైన చట్టాలు తీసుకురావాలని బిల్‌గేట్స్ సూచించారు.