సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో మరో సినిమా చేయనున్న హీరో ధనుష్

రిపోర్టర్: నరేష్ స్థలం: చెన్నై

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరోసారి టాలీవుడ్‌లో కొత్త ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. సార్ సినిమాను నిర్మించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఆయన మరో చిత్రం చేయనున్నట్లు సమాచారం. లబ్బర్ పందు డైరెక్టర్ తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వం వహించనున్న ఈ రూరల్ ఎంటర్‌టైనర్‌కు ధనుష్ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.