ఎస్సీ, ఎస్టీల రక్షణకు నాలుగు అంచెల కార్యాచరణ: సీఎం చంద్రబాబు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ హైపవర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ వర్గాల రక్షణ, సంక్షేమం కోసం నాలుగు అంచెల కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించారు. 2026లో 810 కేసులను పరిష్కరించామని, బాధితులకు రూ.15.43 కోట్ల పరిహారం అందించామని అధికారులు తెలిపారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక విజిలెన్స్ కమిటీలు, ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.