బీఈడీ కాలేజీల అక్రమాలపై ఉన్నత విద్యాశాఖ ఉక్కుపాదం: అందరినీ చేర్చుకోవాలని ఆదేశం
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన అభ్యర్థులను చేర్చుకునేందుకు ఇబ్బందులు పెడుతున్న బీఈడీ కళాశాలల తీరుపై వచ్చిన ఫిర్యాదులతో ఉన్నత విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి యాజమాన్య కోటా ఫీజులు వసూలు చేస్తూ, తరగతులకు రాకపోయినా ఫర్వాలేదంటున్న కాలేజీల ప్రవర్తనను తీవ్రంగా పరిగణించామన్నారు. కన్వీనర్ కోటా విద్యార్థులందరినీ విధిగా చేర్చుకోవాలని, ఆన్ లైన్ హాజరు తప్పనిసరి చేయాలని ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసినట్లు వెల్లడించారు.