నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీలోకి వచ్చేసిన మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సినిమా

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

మాస్ మహారాజా రవితేజ నటించి శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ఇరుముడి నేటి నుంచి ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో అధికారికంగా స్ట్రీమింగ్ అవుతోంది. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే పవిత్రమైన భావోద్వేగాలు మరియు భక్తి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి అందుబాటులోకి వచ్చింది.