అంపాపురం డ్రెయిన్ పూడికతీత పనులతో పంటలకు తపిన వరద ముప్పు

రిపోర్టర్: కృష్ణ స్థలం: కృష్ణా

అంపాపురం మీడియం డ్రెయిన్లో చేపట్టిన ముందస్తు పూడికతీత పనుల వల్ల వేలాది ఎకరాల పంటలకు వరద ముప్పు తప్పిందని యార్లగడ్డ వెంకట్రావు - ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే వెల్లడించారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డ్రెయిన్లో నీటి ప్రవాహం వేగంగా సాగుతోందని ఆయన తెలిపారు. ఎటువంటి ముంపు సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంతో రైతులకు ఎంతో ఊరట లభించిందని పేర్కొంటూ ఆయన స్పష్టం చేశారు.