ఆసియా క్రీడల రోయింగ్ క్యాంపులో చివరి నిమిషపు మార్పులపై తీవ్ర అసంతృప్తి

రిపోర్టర్: విజయ్ స్థలం: న్యూఢిల్లీ

ఆసియా క్రీడల ప్రారంభానికి ముందు భారత రోయింగ్ క్యాంపులో కలవరం చెలరేగింది. చివరి నిమిషంలో సిబ్బంది కూర్పులు, ఈవెంట్ ఎంట్రీలను మార్చడంపై అథ్లెట్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా జరిపిన ఈ మార్పుల వల్ల తమకు తీవ్ర మానసిక ఆందోళన కలిగిందని, రాత్రంతా నిద్రపోలేదని పలువురు క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. అరవింద్ సింగ్, బాల్‌రాజ్ పన్వార్‌తో పాటు పలువురు రోవర్ల ఈవెంట్లను మార్చడంపై క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది.