ధర్మవరంలో ఉద్రిక్తత: కూటమి శ్రేణుల దాడులపై కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నిప్పులు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: శ్రీ సత్యసాయి జిల్లా
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నామినేషన్ల పర్వం సందర్భంగా వైసీపీ, కూటమి శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగిందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఇరువర్గాల రాళ్లదాడిలో గాయపడిన కార్యకర్తలను వీల్చైర్లలో కూర్చోబెట్టి ఆయన భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఓటమి భయంతోనే కూటమి నేతలు ఫ్యాక్షనిజాన్ని రెచ్చగొడుతున్నారని, రౌడీ మూకలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని లేదంటే నిరసనలు ఉధృతం చేస్తామని కేతిరెడ్డి హెచ్చరించారు.