స్థానిక సంస్థల అభ్యర్థుల నామినేషన్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని ఎస్ఈసీ నిర్ణయం
రిపోర్టర్: రమేష్
స్థలం: અમరావతి
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ పత్రాలు మరియు అఫిడవిట్లను ప్రజల ఉపయోగం కోసం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు వెల్లడించింది. నూజివీడుకు చెందిన వలపర్ల శివకార్తీక్ దాఖలు చేసిన పిల్‌పై విచారణ సందర్భంగా ఎస్ఈసీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఓటర్లు అభ్యర్థుల నేపథ్యాన్ని తెలుసుకునేలా ప్రత్యేక పోర్టల్ ద్వారా అన్ని వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.