నాగావళి పరివాహక ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిశీలన చేసిన గోండు శంకర్
రిపోర్టర్: గోపి
స్థలం: Srikakulam
అర్నాబ్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి పరివాహక పీజీ పేట ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టినట్లు గోండు శంకర్ తెలిపారు. సముద్ర ముఖద్వారం వద్ద 200 పొక్లెయిన్లతో ఇసుక మేటలను తొలగించి వరద నీరు సాఫీగా వెళ్లేలా పనులను వేగవంతం చేసినట్లు ఆయన వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల కోసం గజ ఈతగాళ్లను సిద్ధం చేశామని, ప్రభుత్వం ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు.