తెలంగాణలో క్రమంగా తగ్గుముఖం పడుతున్న అల్పపీడన ప్రభావ తీవ్రత

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో వాయుగుండం లేదా అల్పపీడన ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోందని వెదర్ మన్ బాలాజీ తెలిపారు. రాష్ట్రంలోని ఈశాన్య జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో సాయంత్రం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెదర్ మన్ సూచించారు.