యాదాద్రి పవర్ ప్లాంట్ మోసంపై ఆధారాలతో నిజాలు బట్టబయలు: భట్టి విక్రమార్క

రిపోర్టర్: విజయ్ స్థలం: ఖమ్మం

యాదాద్రి పవర్ ప్లాంట్ పేరుతో గత ప్రభుత్వం మోసానికి పాల్పడిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. రెండు వేల పద్దెనిమిది, పందొమ్మిది నాటికే ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఒప్పందం చేసుకొని, రెండు వేల ఇరవై మూడు దాటినా పూర్తి చేయలేదని ఆయన మండిపడ్డారు. కనీసం బొగ్గు లభ్యతపై సరైన ప్రణాళిక లేకుండా ప్లాంటు కట్టి, రాష్ట్ర ప్రజలపై వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం మోపారని ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతున్నామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.