అనంతపురంలో కిమ్స్ సవీరా ఆసుపత్రి నూతన భవనాలను ప్రారంభించిన మంత్రులు

రిపోర్టర్: విజయ్ స్థలం: Anantapur

అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన భవనాలను రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఐదు వందల పడకల సామర్థ్యంతో ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, హెమటాలజీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ విభాగాలను ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. రాయలసీమ ప్రజలు అత్యాధునిక వైద్యసేవల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, స్థానికంగానే అందుబాటులోకి తెచ్చామని మంత్రులు స్పష్టం చేశారు.