తీవ్ర తుఫాను ముప్పు: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వాయుగుండం దూసుకొస్తోంది

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విశాఖపట్నం

దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.