పెద్దమిట్టపల్లి అనాథ ఆశ్రమంలో ఘనంగా అన్నదానం

రిపోర్టర్: పి రాజేష్ కుమార్ స్థలం: గంగాధర నెల్లూరు

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పెద్దమిట్టపల్లిలోని శ్రీ ఆనంద నిలయ అనాథ ఆశ్రమంలో అన్నదానం, యోగా, ధ్యాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ కార్యనిర్వాహకురాలు బండి కృష్ణవేణి పర్యవేక్షణలో ప్రతి శనివారం ఇక్కడ సేవా కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.

ఈ కార్యక్రమంలో రిటైర్డ్ లెక్చరర్ ఏద్దాల బాలకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి అన్నదానాన్ని ప్రారంభించారు. పలువురు ప్రముఖులు పాల్గొని అనాథలకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో బి.దామోదర్ రెడ్డి, ఆర్టీఐ యాక్టివిస్ట్ బండి పట్టాభిరెడ్డి, బి.మాధవిలత తదితరులు పాల్గొన్నారు.