విజయవాడలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ
రిపోర్టర్: హరి
స్థలం: విజయవాడ
ఇంటిపట్టాల విషయంలో ఏకంగా నూట ఇరవై ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో పేదలకు పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన ఇరవై ఆరు వేల మందికి పైగా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ప్రతి పేదవాడికి అండగా నిలిచి న్యాయం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా భరోసానిచ్చారు.