చెన్నైలో భారీ చోరీ: నడిరోడ్డుపై దాడి చేసి ముప్పై ఆరు లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు
రిపోర్టర్: విజయ్
స్థలం: చెన్నై
చెన్నైలోని ప్యారీస్ ప్రాంతంలో బ్యాంకుకు నగదు జమ చేయడానికి వెళ్తున్న ఇద్దరు ఉద్యోగులపై నలుగురు దుండగులు కత్తులతో దాడి చేసి ముప్పై ఆరు లక్షల రూపాయల నగదును బలవంతంగా ఎత్తుకెళ్లినట్లు బాధితుడు కందన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ పుటేజీ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.