పట్టాల పంపిణీలో పాలకుల నిర్లక్ష్యాన్ని నిలదీసిన బీఆర్ఎస్ నేతలు

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి పట్టణంలో జీవో 58, 59, 76 కింద పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రజల ప్రయోజనాల కోసం పట్టాలు మంజూరు చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పంపిణీ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. అర్హులైన లబ్ధిదారులకు వెంటనే పట్టాలు అందించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.