హైవేపై ఘోర ప్రమాదం: కారు దగ్ధమై నలుగురు సజీవదహనం

రిపోర్టర్: విజయ్ స్థలం: విజయవాడ

విజయవాడ పశ్చిమ బైపాస్ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిక్ కారు అగ్నికీలల్లో చిక్కుకుని నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారని పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా నంబూరులో శుభకార్యానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పడంతో మంటలు చెలరేగి ఈ దుర్ఘటన జరిగిందని, తీవ్రంగా గాయపడిన మరొకరిని ఆసుపత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.