గిటార్ను వ్యక్తిగా భావించి స్కూటీ యజమానికి భారీ చలానా

రిపోర్టర్: సురేష్ స్థలం: బెంగళూరు

బెంగళూరులో వెనుక గిటార్ తగిలించుకుని స్కూటీపై వెళ్లిన సౌవిక్ దత్తాకు ట్రాఫిక్ పోలీసులు ఐదు వందల రూపాయల జరిమానా విధించారు. గిటార్ను మరో వ్యక్తిగా ఏఐ ట్రాఫిక్ కెమెరా పొరపడటంతో వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించలేదంటూ ఈ చలానా జారీ చేశారు. తనకు అందిన ఈ విచిత్రమైన చలానా చూసి షాక్ తిన్న బాధితుడు, దీనిని ఎక్స్లో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.