విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు నాని
రిపోర్టర్: సతీష్
స్థలం: Vijayawada
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గ మల్లే్వర స్వామి వార్లను, కనకదుర్గ అమ్మవారిని ప్రముఖ సినీ నటుడు నాని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల విడుదలైన 'ద ప్యారడైజ్' సినిమా ఘన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న నేపథ్యంలో ఆయన అమ్మవారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయానికి చేరుకున్న నానికి అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ ఆధ్యాత్మిక పర్యటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.