దివంగత నేత దామోదర్‌రెడ్డి స్మృతిలో ఉప్పొంగిన శ్రేణుల అభిమానం
రిపోర్టర్: Madhu Bngr
స్థలం: మోత్కూరు
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి స్వర్గీయ రామ్‌రెడ్డి దామోదర్‌రెడ్డి జన్మదిన వేడుకలను నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యాదాద్రి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వంగాల సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జిట్ట సైదులు, ఉపసర్పంచ్ బండ లింగయ్యతో పాటు పలువురు వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ యువజన నాయకులు మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు.