కూటమి ప్రభుత్వ మోసాలపై పేర్ని నాని తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: విజయ్
స్థలం: కృష్ణా జిల్లా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని కృష్ణా జిల్లాలో జరిగిన సమావేశంలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు పంగనామాలు పెట్టారని ఆయన మండిపడ్డారు. మహిళలను నమ్మించి మోసం చేయడమే కూటమి ప్రభుత్వ నైజమని, గత జగన్ హయాంలో అందించిన లబ్ధిని ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతోందని పేర్ని నాని నిలదీశారు.